Wednesday, January 22, 2025

ఢిల్లీలో తీవ్ర వడగళ్లు, ఈదురు గాలులు, వాన…

- Advertisement -
- Advertisement -

Delhi hail rain

న్యూఢిల్లీ: ఈ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో  వడగళ్ల వాన కురిసింది, మంచుగడ్డలు వాహనాల విండ్‌షీల్డ్‌లు,  మోటార్‌సైకిల్‌దారులను తాకడంతో చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై అనేక ప్రయాణీకుల విమానాలు తిరుగుతున్నట్లు చూపుతున్నాయి,కానీ ప్రతికూల వాతావరణం చక్కబడే వరకు వేచి ఉండాలని కూడా పేర్కొంటున్నాయి.  “ఢిల్లీలో వానలు, ఉరుములు మా విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి. దయచేసి ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఉండేందుకు తగినంత ప్రయాణ సమయాన్ని చేతిలో పెట్టుకోండి. మీ విమాన స్థితిని చెక్ చేసుకోండి. ఏదైనా సహాయం కోసం, మాకు Twitter/Facebookలో DM చేయండి” అని ఇండిగో ట్వీట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News