Sunday, December 22, 2024

ఎన్నికల తనిఖీల్లో రూ. 469 కోట్ల నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

11,859 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు సిఈవో అధికారులు వెల్లడి

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన తరువాత భారీగా నగదు, మద్యం, బంగారు అభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న నగదు, తదితర వివరాలను అధికారులు వెల్లడించారు. రూ.469.63 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోగా దీనికి సంబంధించి 11,859 ఎఫ్‌ఆర్‌లు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే విధంగా 2018 ఎన్నికల సందర్భంగా రెండు వేలకుపైగా కేసులు నమోదు కాగా రూ.103 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో భారీగా కేసులు పెరగగా పెద్ద మొత్తంలో నగదును పట్టుకున్నారు.

2023 కు సంబంధించిన వివరాలు ఇవే…
నగదు రూ. 241.52 కోట్లు కాగా 241 ఎఫ్ఐఆర్ లు  నమోదు
బంగారు ఆభరణాలు రూ. 175.95 కోట్లు , 5 ఎఫ్‌ఐఆర్ లు నమోదు
మద్యం రూ. 13.36 కోట్లు, 11,195 ఎఫ్ఐఆర్ లు నమోదు
మత్తు పదార్ధాలు రూ. 22.17 కోట్లు , 323 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
ఉచితాలు రూ. 16.63 కోట్లు కాగా 95 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News