Thursday, January 23, 2025

ముమ్మాటికీ మాది టి టీమ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటు సమాధానం ఇచ్చారు. ‘రాహుల్ వచ్చి మమ్మల్ని మీ బి టీమ్ అంటారు, మీరొచ్చి మేము కాంగ్రెస్ సి టీమ్ అంటారు. మేం బిజెపికి బి టీమ్ కాదు, కాంగ్రెస్‌కు సి టీమ్ కాదు, మాది ముమ్మాటికీ టి టీమ్.. తెలంగాణ టీమ్’ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ అని అన్నారు. నిన్నటి దాకా మత రాజకీయం చేశారు!!, నేడు కుల రాజకీయానికి తెర తీశారా?? అని ప్రశ్నించారు. పదేళ్ల మీ హ యాంలో దేశంలోని బిసిలకు మిగిలింది వేదన అరణ్య రోదనేనన్నారు. కనీసం బిసిల జనగణన కూడా చేయని పాలన మీది, కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది, అం దుకే బిజెపి ముమ్మాటికీ బిసిల వ్యతిరేక పార్టీయేనని తెలిపారు. బిసిలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు కానీ, మాకు బీసీలంటే బలమైన వర్గాలన్నారు. రాష్ట్రంలోని బిసిలకు పదవులే కాదు, అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది అని స్పష్టం చేశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు, నిందితులతో వేదిక పంచుకుని మాపై నిందలా ?? అని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్‌నే మించిపోయింది మీ బిజెపి ప్రభుత్వం అంటూ తూలనాడారు. ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు, రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరమేనన్నారు. బిఆర్‌ఎస్ అంటేనే భారత రైతు సమితి అని గుర్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News