అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని ఖంబాట్ పట్టణంలో, ఉత్తర గుజరాత్‌లోని సబర్‌కాంత పట్టణంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడు ఒకరు చనిపోగా, ఓ పోలీసు సహా అనేక మంది గాయపడ్డారు. దుకాణాలను తగుల బెట్టారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. చివరికి పోలీసులు లాఠీఛార్జీ, భాష్పవాయు ప్రయోగం కూడా చేయాల్సి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి భౌతిక కాయం ఖాంబాట్ పట్టణంలో ఇరువర్గాల ఘర్షణానంతరం రాత్రి లభించింది. ఇక హిమ్మత్‌నగర్‌లో అనేక మంది రాళ్లు రువ్వుకోగా నలుగురు పోలీసులు సహా అనేక మందికి గాయాలయ్యాయి. ఇదిలావుండగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ రాత్రి సీనియర్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఖాంబాట్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అభిషేఖ్ గుప్తా ‘ఘర్షణలు జరిగిన చోట లభించిన శవం 60 ఏళ్ల వృద్ధుడిది. అయితే అతడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. అతడు ఎలా చనిపోయాడన్నది పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా తెలియగలదు. మేము ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశాము. ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయగలం’ అన్నారు. ఇక ఆనంద్ పట్టణానికి చెందిన ఎస్పీ అజిత్ రజియన్ ‘ప్రస్తుతం ఖాంబాట్‌లో శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉంది’ అన్నారు.
గుజరాత్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ: ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -