Thursday, December 5, 2024

ఐటి సోదాల్లో రూ. 7 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో సోమవారం జరిగిన ఐటి దాడుల్లో 7 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో అధికారులు జరిపిన దాడుల్లో ఇటు రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు, ఫార్మా కంపెనీలపై దృష్టి పెట్టారు. ఖమ్మం జిల్లాలో ఓ అభ్యర్ధికి డబ్బులు సమకూర్చుతున్నారనే సమాచారంతో రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

మరోవైపు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి నివాసమైన మైహోం బూజాలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కీలకమైనన డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఓపెన్ చేసి బుధవారం ఐటి కార్యాలయానికి పిలిచే అవకాశాలు ఉన్నాయి. వివాదాస్పద భూముల అమ్మకాలు ఎక్కువగా జరిపే వ్యక్తిగా ప్రదీప్ రెడ్డికి పేరు. అధికారులతో సత్సంబంధాలతో పాటు రాజకీయంగానూ పలుకుబడి ఉపయోగించి కోట్ల రూపాయలు డీల్ చేస్తున్నట్టుగా సమాచారం.

మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్దుల ఇళ్లలో, వారి అనుచరులపై ఐటి సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. వరుస పెట్టి చేస్తున్న దాడులు రాజకీయ వ్యూహంలో భాగమనే ప్రచారం జరుగుతోంది. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కెఎల్‌ఆర్, నియోజకవర్గంలోని ఇతర నేతలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతల ఇళ్లలోనూ ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు జరగడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. ఓ పార్టీకి లబ్ది చేకూర్చేందుకే ఇదని గుసగుసలు వినపడుతున్నాయి. ఎన్నికల్లో డబ్బులు బయటకు రాకుండా చేసే ప్లాన్‌గా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News