Thursday, January 23, 2025

కెపిహెచ్‌బీలో రూ. 6.35కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: డివిజన్‌లో రూ.6.35 కోట్ల రూపాయల వ్య యంతో చేపట్టనున్న పలు అభివృద్ధ్ది పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరం ఎంతో అభివృద్ధి చెందిందని, కూకట్‌పల్లి నియోజకవర్గానికి అడిగిన వెంటనే నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేపీహెచ్‌బి డివిజన్‌లోని ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలు అయిన పార్కులు, ఇండోర్‌స్టేడియం, మంచినీరు, సీసీ రోడ్లు, అండర్‌పాస్ బ్రిడ్జీలు, ప్లై్లై ఓవర్లను వేల కోట్లతో పనులు పూర్తిచేశామని చెప్పారు. 95శాతం పనులు పూర్తయ్యాయని ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.
10న ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
కేపీహెచ్‌బి డివిజన్‌లో 5వ ఫేజ్ వద్ద వంద పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి ఈనెల 10వ తేదీన మంత్రి హరీష్‌రావు చేతుల మీ దుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఈ విధంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి కావలిసిన అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపా రు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, ఈఈ సత్యనారాయణ, డిఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్, డిఇజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News