Sunday, November 17, 2024

కర్నాటకలో స్థానికులకే ఉద్యోగాలలో ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోస్ట్

బెంగళూరు: ప్రైవేట్ రంగంలో స్థానికులకే ఉద్యోగాలు తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం కొత్త బిల్లు ఆమోదించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎక్స్ లో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. దాని ప్రకారం ప్రైవేట్ పరిశ్రమల్లోని గ్రూప్ సి,డి గ్రేడ్ ఉద్యోగాలు నూటికి నూరు శాతం కన్నడిగులనే నియమించాలని మంత్రి వర్గం సోమవారం బిల్లును ఆమోదించిందని పేర్కొంది. ఇదే పద్ధతి దక్షిణాది రాష్ట్రాల అంతటా వస్తే బాగుంటుందేమో?…

అయితే సిద్దరామయ్య పోస్ట్ పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన తర్వాత దానిని తొలగించారు.  ఆ తర్వాత మరో సవరణ ట్వీట్ చేశారు. కన్నడిగులకు కోటా గురించి పేర్కొన్నారు.

కర్నాటక బిల్లు వల్ల కర్నాటకలో ఐటి సంస్థలతో సహా వివిధ పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు తగ్గిపోనున్నాయని తెలుస్తోంది. కర్నాటకలో జన్మించి 15 ఏళ్లుగా నివసిస్తున్న వారిని, కన్నడ భాష మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసిన వారినే స్థానికులుగా గుర్తించనున్నారు. అంతేగాక రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో నెగ్గిన వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News