Saturday, November 23, 2024

సాత్విక్ జోడీ స్వర్ణాధ్యాయం

- Advertisement -
- Advertisement -

దుబాయ్: బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్ 2023 పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత్ జోడీ స్వర్ణాధ్యాయ్యాన్ని లిఖించింది. భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్‌శెట్టి సర్ణపతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 58ఏళ్ల నిరీక్షణకు సాత్విక్ జోడీ తెరదించింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు బంగారు పతకం రావడం ఇదే ప్రథమం. ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన ప్రపంచ ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్, టియో ఈ యీతో సాత్విక్‌జోడీ తలపడింది. మలేసియా ద్వయంపై మూడు గేమ్‌ల మ్యాచ్‌లో 1621, 2117, 2119తేడాతో గెలిచి భారత్ ఛాంపియన్‌గా అవతరించింది. తొలిగేమ్‌ను 1621తో కోల్పోయిన సాత్విక్ జోడీ అనంతరం పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకోవడం విశేషం.

రెండో గేమ్‌ను 2117, మూడో గేమ్‌ను 2119తో సొంతం చేసుకుని భారత్ కీర్తిపతకాన్ని ఎగురవేసింది. కాగా టోర్నీ తొలిరౌండులో మలేషియా 2114, 2117తేడాతో, రెండో రౌండులో 2113, 2121తేడాతో కొరియాపై గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అనంతరం క్వార్టర్స్‌లో ఇండోనేసియా జంట మహ్మద్ అహ్సన్‌హెండ్రా సెటియావాన్‌పై 2111, 2112తో సాత్విక్ జోడీ గెలుపొందింది. సెమీఫైనల్లో సాత్విక్ జోడీ చైనీస్ తైపీకి చెందిన లీయాంగ్‌వాంగ్ చి లిన్‌పై 2118, 1314రిటైర్డ్‌తో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించి రజతం ఖరారు చేసుకుంది.కాగా ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌లో భారత్‌కు 52ఏళ్ల క్రితం కాంస్య లభించింది. 1971లో పురుషుల డబుల్స్ విభాగంలో దీపు ఘోష్‌రామన్ ఘోష్ కాంస్య పతకం సాధించారు. తాజాగా సాత్విక్ జోడీ స్వర్ణం సాధించి ఆసియా ఛాంపియన్స్‌గా చరిత్రను తిరగరాసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News