Friday, December 20, 2024

తొమ్మిదేళ్లలో గ్రామాలు ఎంతో అభివృద్ది

- Advertisement -
- Advertisement -
  • గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి

ఘట్‌కేసర్: ముఖ్యమంత్రి కేసిఆర్ కృషితో తొమ్మిదేళ్ళలో తెలంగాణ ఎంతో అభివృద్ది సాధించిందని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలలో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యలయం ఆవరణలోని గాంధీ, అంబేద్కర్, జయశంకర్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూల మాలలు వేసి ర్యాలీగా నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు.

అనంతరం గ్రామ పంచాయితీ ఆవరణలో జరిగిన సమావేశంలో ఉత్తమ గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య సిబ్బందికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి పని కాచవాని సింగారంలో కనిపిస్తున్నాయని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డిని అభినందించారు.

పలు మార్లు ఉత్తమ గ్రామ పంచాయితీ ఆవార్డు అందుకోవడం అభివృద్ధి నిదర్శనమని గుర్తు చేశారు. తెలంగాణ గ్రామాల అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలించిందని, గ్రామాల అభివృద్ధితోపాటు రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కర్రె జంగమ్మ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీత, వార్డు సభ్యులు మట్ట విష్ణుగౌడ్, మట్ట లలిత, ఓరుగంటి సరళ, రాజగోని మహేష్ కుమార్, బండిరాల శ్యామ్, కో ఆప్షన్ సభ్యులు వర్కాల అంజనేయులు గౌడ్, బిల్ కలెక్టర్లు శ్రీనివాస్, సుదర్శణ్ రెడ్డి, విష్ణు, బండిరాల శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News