- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు తాయిలాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా తాయిలాల పంపకాలపై నిఘా పెట్టారు. నగరంలో శనివారం పలు ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓటర్లకు పంపిణీకి సిద్దంగా ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
క్రీడా సామాగ్రి, దుస్తువులు, వంట సామాగ్రి పరికరాలను ఈ దాడుల్లో సీజ్ చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులంతా ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల మధ్య ముఖాముఖీ పోటీ ఉండనుండటంతో అభ్యర్థుల మధ్య నువ్వా,నేనా? అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది.
- Advertisement -