Thursday, January 23, 2025

అఖండ భారత్‌కు కౌంటర్‌గా తెరమీదకు అఖండ నేపాల్ !

- Advertisement -
- Advertisement -

కట్మాండు: న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖండ భారత్ కుడ్య చిత్రంపై నేపాల్‌లో ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనను ఉదృతం నేపథ్యంలో ఇందుకు జవాబుగా కట్మాండు మేయర్ తన కార్యాలయంలో అఖండ నేపాల్ చిత్రపటాన్ని ఉంచారు.

ఈ వివాదంపై నేపాల్ ప్రభుత్వం పెదవి విప్పనప్పటికీ సిపిఎన్-యుఎంఎల్‌తోసహా ప్రతిపక్ష పార్టీలన్నీ భారత కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన అఖండ భారత్ కుడ్య చిత్రంపై వ్యతిరేకతను తెలియచేస్తున్నాయి. అఖండ భారత్ కుడ్య చిత్రంలో నేపాల్‌ను కూడా తమ భూభాగంలో కలుపుకోవడంపై అభ్యంతరం తెలియచేస్తున్నాయి. ఈవిషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి.

తన భార్య చికిత్స కోసం ప్రస్తుతం బెంగళూరులో ఉన్న కట్మాండు మేయర్ షా భారత్ సందర్శనకు ముందుగానే తన కార్యాలయంలో అఖండ నేపాల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.

ఒకప్పుడు నేపాల్ సరిహద్దులు తూర్పు దిశలో తీస్టా వరకు పశ్చిమ దిశలో సట్లెజ్ వరకు విస్తరించి ఉండేవి. అయితే బ్రిటిష్‌తో యుద్ధానంతరం తన అత్యధిక భూభాగాన్ని నేపాల్ కోల్పోయింది. యుద్ధదం తర్వాత సరిహద్దులు మేచి నుంచి టీస్టా వరకు, మహాకాళి నుంచి సట్టెజ్ వరకు భారత్‌లో శాశ్వతంగా విలీనమయ్యాయి.

1816 మార్చి 4న నేపాల్, ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య సుగోలి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నేపాల్ సరిహద్దులు మేచి-మహాకాళికి కుంచించుకుపోయాయి. కట్మాండు మేయర్ కార్యాలయంలో ఉంచిన నేపాల్ చిత్రపటంలో ప్రస్తుతం భారతీయ సరిహద్దులుగా ఉన్న తూర్పు టీస్టీ నుంచి పశ్చిమ కంగ్రా వరకు ప్రాంంతాలన్నీ నేపాల్ భూభాగంలో ఉన్నాయి. జాతీయవాది ఫణీంద్ర నేపాల్ చాలా కాలంగా అఖండ నేపాల్ కోసం ప్రచారోద్యమం సాగిస్తున్నారు.
కాగా, నేపాల్ పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గగన్ థాపా గురువారం విలేకరులతో మాట్లాడుతూ నేపాల్ ప్రభుత్వం కూడా అధికారికంగా అఖండ నేపాల్ చిత్రపటాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు. తమ దేశ సాసంస్కృతిక చిత్రపటాన్ని ఏ దేశమైనా ముద్రిచినపుడు నేపాల్‌కు కూడా తమ దేశ సాంస్కృతిక చిత్రపటాన్ని చిత్రపటాన్ని ముద్రించుకునే హక్కు ఉంటుందని, నేపాల్ ప్రభుత్వం అఖండ నేపాల్ పేరిట సాంస్కృతిక దేశ పటాన్ని ముద్రించిన పక్షంలో భారత్ అభ్యంతరం చెప్పకూడదని థాపా అన్నారు.
ఈ వివాదం సాగుతున్న నేపథ్యంలోనే నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ బుధవారం జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ అఖండ భారత్ కుడ్య పటంపై భారత్ వైఖరిని సమర్థించారు. అది రాజకీయ అంశం కాదని చెప్పారు. కొత్త పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన అఖండ భారత్ కుడ్య చిత్రం అంశాన్ని భారత ప్రభుత్వం వద్ద ప్రస్తావించానని ఆయన చెప్పారు. అయితే అది సాంస్కృతిక, చారిత్రక చిత్రపటమే తప్ప రాజకీయ చిత్రపటం కాదని భారత్ జవాబిచ్చిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం భారత భూభాగంలో ఉన్న కాలాపాని, లిపు లేఖ్, లింపీధురా ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ వాదిస్తోంది. దీనిపై భారత్ సమాధానానికి స్పందనగా ఆ ప్రాంతాలను తమ భూభాగంలో చేర్చుతూ నేపాల్ ప్రభుత్వం 2020లో ఒక కొత్త రాజకీయ చిత్రపటాన్ని విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News