Sunday, January 19, 2025

సంగారెడ్డిలో వైశ్య భవన్‌కు రెండెకరాలివ్వాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రికి సంఘం నేతల వినతి

సంగారెడ్డి టౌన్: జిల్లా ఆర్య వైశ్య మహాసభ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్‌రావుకు సోమవారం జిల్లా ఆర్యవైశ్య సంఘ నేతలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంతకిషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. సోమవారం మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యం సంఘం నేతలు ఆయిన్ని కలిశారు. తమ సంఘం కేవలం సంఘ సభ్యుల కోసమే కాకుండా సమాజంలోని ఇతర వర్గాల కోసం కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నదని వివరించారు. దశాబ్ధాలుగా సమాజ హితం కోసం తమ సంఘం పని చేస్తున్నదని చెప్పారు.

అందుకని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో స్థలం కేటాయించాలని కోరారు. సిఎం కెసిఆర్‌తో పాటు మీరు కూడా ఆర్యవైశ్యుల పట్ట ఎంతో ఉదారంగా వ్యవహరించారని, సిద్దిపేటలో ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మహాత్మ గాంధీ, పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి విజయం సాధించారని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి విన్నవించామని, మరోసారి సంగారెడ్డి జిల్లాలోని అనేక మందితో కలిసి ఈరోజు విన్నవిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులున్నారని , అందుకని సంఘ భవనానికి రెండెకరాల స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్, జిల్లా అధ్యక్షుడు మాణిక్య ప్రభు,జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్‌గుప్తా,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటగిరి సతీష్ గుప్తా,

జిల్లా ఉపాధ్యక్షుడు చేనూరి భాస్కర్ గుప్తా, మాశెట్టి ప్రకాశం గుప్తా, దిడిగె నగేష్, కంది కృష్ణమూర్తి,నగేష్ చౌదరి, గంగంయ్య పంతంగి రమేష్,కొంపలి విద్యా సాగర్,పాంపాటి కృష్ణమూర్తి,ఆమేటి మహేందర్, చందాశ్రీధర్, పుల్లూరి ప్రకాష్, బుస్సా శ్రీనివాస్, నామా భాస్కర్,అల్లింకి రాములు, పుట్నాల లక్ష్మణ్, అనుముల సంతోష్,మదిరె కృష్ణ,గుజ్జల్వార్ సంతోష్, పరువయ్య, కొత్త ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, చింత ప్రభాకర్‌ను వారు శాలువతో సత్కరించారు.మంత్రి సానుకూలంగా స్పందించారని తోపాజి అనంతకిషన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News