- Advertisement -
న్యూఢిల్లీ: కన్వర్ యాత్ర కొనసాగుతున్న మార్గంలో తినుబండారాల దుకాణాలలో యజమాని, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించింది. ఈ యోచన వెనుక ‘పారదర్శకత’ ఉద్దేశ్యం ఉందని పేర్కొంది. ఏయే దుకాణాలలో ఎలాంటి తినుబండారాలు పెడుతున్నారనేది కన్వరీలకు తెలుస్తుందని పేర్కొంది.
సుప్రీంకోర్టు జులై 22న ప్రభుత్వ ఆదేశాలపై తాత్కాలిక స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన అఫిడవిట్ దాఖలు చేసింది. ‘పారదర్శకత’ కోసమే ఆ ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. తినుబండారాలు అమ్మే వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుందని, అందులో ఫోటో సహా ఐడి ఉంటుందని పేర్కొంది. ఆహార భద్రత నియమనిబంధనలు 2011 ప్రకారం దుకాణాలు నడుపాల్సి ఉంటుందని కోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
- Advertisement -