Monday, December 23, 2024

లండన్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి ఎన్నారై  సెల్ యూకే ఆధ్వర్యంలో మంగళవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని చేస్తున్న కార్యక్రమంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం అవ్వాలని టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ పిలునిచ్చారు. కొన్నేళ్లుగా మతం పేరుతో, కులం పేరుతో, ఆహారం పేరుతో జరుగుతున్న దాడులపై మేధావులు మౌనం వీడాలని ఆయన అన్నారు. కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయులను కలుస్తూ, అందరి ఆలోచనలు వింటూ, వారి ఆలోచనలతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్లే ఆలోచన అద్భుతం అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళరపు, మేరీ, నరేశ్, శ్రీనివాస్ రెడ్డి, షాయబ్ ఖాన్, మధుకర్ రెడ్డి, కళ్యాణ్, ఎన్నారై సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు.
18వ తేదీ లండన్‌కు సిఎం
18 వ తేదీ అధికార పర్యటనలో భాగంగా లండన్ రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలుకుతూ, ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడే ‘హలో లండన్’ కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News