Thursday, January 16, 2025

పాలస్తీనియన్ల పట్ల ప్రియాంక సంఘీభావం

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా ప్రజలకు మద్దతు సూచకంగా కాంగ్రెస్ ఎంపి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ‘పాలస్తీనా’ అని రాసి ఉన్న బ్యాగ్‌ను తీసుకుని పార్లమెంట్‌కు హాజరయ్యారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ప్రియాంక పాలస్తీనియన్ల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. పాలస్తీనా పట్ల సంఘీభావం సూచకంగా ప్రియాంక ‘పాలస్తీనా’ అని రాసిఉన్న, పుచ్చకాయతో సహా పాలస్తీనా చిహ్నాలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకువెళ్లడం కనిపించింది. బ్యాగ్ అంశంపై వయనాడ్ ఎంపి ప్రియాంకను బిజెపి లోక్‌సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ తూర్పారపడుతూ, ఆమె ఏ సందేశాన్ని పంపాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.

‘బంగ్లాదేశ్‌లో హిందువులపై అత్యాచారాల గురించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ పాలస్తీనా బ్యాగ్‌తో ఫ్యాషన్ ప్రకటన చేయాలని అనుకుంటున్నారు’ అని ఠాకూర్ ఆరోపించారు. ‘పాలస్తీనా’ బ్యాగ్ విషయమై బిజెపి నేతలు ఆక్షేపిస్తుండడం గురించి ప్రశ్నించినప్పుడు ప్రియాంక సమాధానం ఇస్తూ, ‘బంగ్లాదేశ్‌లో మైనారిటీలు హిందువులు, క్రైస్తవులపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఏదో ఒకటి చేయవలసిందని వారితో చెప్పంది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి, ఆ అత్యాచారాలు ఆపించండి’ అనిపేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News