- Advertisement -
నూయార్క్: స్పెయిన్‌లో అబార్షన్స్ చట్టం 2010లో ఆమోదించబడింది. అక్కడ అబార్షన్ చేయించుకోవాలో వద్దో అనే నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉంటుంది. అయితే అబార్షన్ చేయించుకోవాలనుకుంటే గర్భందాల్చిన తొలి 14 వారాల్లోనే మహిళలు ప్రొసీజర్లు పాటించాల్సి ఉంటుంది. అయితే అక్కడి డాక్టర్లు మాత్రం అబార్షన్లు చేయడానికి అంతగా ఇష్టపడ్డంలేదు.
“ మేము డాక్టర్లము. మమ్మల్ని ఫిజిషియన్లు అంటారు. మేము ఇక్కడ ఉన్నది ప్రజలు జీవించేలా సాయపడ్డానికే తప్ప ఎవరు బతకాలి, ఎవరు చావాలి అని నిర్ణయించేందుకు కాదు” అని స్పెయిన్‌లోని ఫిజిషియన్ సోబ్రెవీలా తెలిపారు.
“అబార్షన్ అనేది ఒప్పా, తప్పా అనేది వ్యక్తిగత అభిప్రాయాన్నిబట్టి మారుతుంటుంది” అని జరగోజాకు చెందిన మరో గైనకాలజిస్టు డాక్టర్ మరియా జీసస్ బార్కో అభిప్రాయపడ్డారు.
- Advertisement -