Wednesday, January 22, 2025

కథ కంటెంట్ మేకింగ్ పరంగా ’మైఖేల్’ యూనివర్సల్ రీచ్ వుండే సినిమా

- Advertisement -
- Advertisement -

 

హీరో సందీప్ కిషన్ రొమాంటిక్ యాక్షన్-ప్యాక్డ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ మైఖేల్ రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

సందీప్ కిషన్ మాట్లాడుతూ మైఖేల్ చాలా ప్రత్యేకమైన చిత్రమని, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ ఇలా చాలా మంది అద్భుతమైన నటీనటులు ఈ సినిమా కోసం కలసి వచ్చారని, మేమందరం కథని, దర్శకుడు రంజిత్ ని బలంగా నమ్మామని, మా నమ్మకాన్ని ట్రైలర్ కి వచ్చిన స్పందనే నిలబెట్టిందని, నిర్మాత భరత్ చౌదరి గారు అద్భుతమైన వ్యక్తి అని, ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్దగా మారిందంటే దానికి కారణం భరత్ అని అన్నారు. అలాగే సునీల్ గారు, రామ్ మోహన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ మైఖేల్ ఫిబ్రవరి 3 న విదులౌతుందని తెలిపారు. ఈ సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేశామని, ముఖ్యంగా సందీప్, దర్శకుడు రంజిత్ ఫిజికల్ గా మెంటల్ గా చాలా హార్డ్ వర్క్ చేశారని అన్నారు. ఈ టీంతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, అలాగే వరుణ్ గారు సరికొత్త స్వాగ్ తో తెరపై కనిపిస్తారని, అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ మైఖేల్ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమా సందీప్ కోసం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమాతో సందీప్ నెక్స్ట్ లీగ్ కి వెళ్తాడని చాలా నమ్మకంగా వున్నానని, భరత్ చౌదరి గారి ప్రొడక్షన్ లో పని చేయడం ఇదే మొదటి సారి అని అన్నారు. దర్శకుడు రంజిత్ తో పాటు వండర్ టీం కలసి పని చేశామని, దివ్యాంశం చాలా అద్భుతంగా నటించిందని, ఈ సినిమాలో చాలా మంది నతీన్నటులు వున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3 మీ అందరూ ఈ సినిమాని చూసి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు రంజిత్ జయకోడి మాట్లాడుతూ నేను తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. తెలుగులో మైఖేల్ నా మొదటి చిత్రం. సందీప్ కిషన్ నిర్మాతలు భరత్ గారు, పుష్కర్ రామ్ మోహన్ గారు గారికి థాంక్స్. మైఖేల్ లో యాక్షన్, రోమాన్స్, ఎమోషన్స్ అన్నీ వుంటాయన్నారు. సందీప్ ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశారని, అది తెరపై కనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా ఉన్నతంగా వుంటుందని అన్నారు. కిరణ్ కౌశిక్ అద్బుతమైన విజువల్స్ ఇచారని, అలాగే సామ్ సిఎస్ మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని భారీ నిర్మించారన్నారు. ఫిబ్రవరి 3 అందరూ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలని అని కోరారు.

నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ సందీప్ కిషన్ గారికి సినిమా తప్పా మరో తపన వుండదని, ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ప్రేక్షకులు ఆల్రెడీ ట్రైలర్ లో చూశారని అన్నారు. దర్శకుడు రంజిత్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. విజయ్ సేతుపతి ల, గౌతమ్ మీనన్ లాంటి లెజండ్స్ తో కలసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, వరుణ్ సందేశ్, దివ్యాంశ, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ ఇలా చాలా మంచి నటులు ఇందులో భాగమయ్యారని అన్నారు. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ పని చేశాం, బిజినెస్ గురించి ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదని, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై హ్యుస్ బజ్ ని క్రియేట్ చేశాయని అన్నారు. సినిమాకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. సినిమాపై నమ్మకంగా వెళుతున్నామని, ఖచ్చితంగా సక్సెస్ కొడతామని, సక్సెస్ తర్వాత మళ్ళీ మాట్లాడుతాం అన్నారు

నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ దర్శకుడు రంజిత్ ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పాము. సందీప్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, . సినిమా విషయంలోనే కాదు పబ్లిసిటీతో పాటు మిగతా అన్ని విషయాల్లో ఆయన ఎంతో ఆసక్తితో ఇన్వాల్ అయ్యి వర్క్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వరుణ్ అద్భుతంగా చేశాడని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News