Monday, February 24, 2025

బడ్జెట్‌లో ఆర్‌టిసికి రూ. 9వేల కోట్లు కేటాయించాలి టిజెఎంయు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: మంత్రి వర్గ సమావేశంలో ఆర్‌టిసి రూ. 9వేల కోట్లు కేటాయించడమే కాకుండా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేవిధంగా తీర్మానం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్( టిజెఎంయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.పెండింగ్‌లో ఉన్న రెండు వేతన సవరణలను చేయడమే కాకుండా సంస్థకు రావాల్సిన బకాయిలపై ఆదివారం జరుగనున్న మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడడం సంతోషకరమైనప్పటికి టికెట్ ఇచ్చే విధానంలో ఇబ్బందులను తొలగించాలన్నారు. పది సంవత్సరాల కాలంలో యావత్తు ఆర్‌టిసి కార్మికులకు మాజీ సిఎం చేసిన మోసానికి ఆర్‌టిసి కుటుంభాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఆర్‌టిసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి కుటుంబాలకు అండగా ఉండాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News