Saturday, November 23, 2024

ఉత్పత్తి రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
ఆదేశానికి వెళ్లినప్పడల్లా కొత్త అంశాలు నేర్చుకుంటున్నాం
డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ , నికోమాక్ తైకిషా క్లిన్ రూమ్ కంపెనీలకు శంకుస్థాపన
రూ. 575 కోట్ల పెట్టు బడులతో మూడు నెలల్లో డైపుకు పరిశ్రమ ప్రారంభం
టీఎస్ ఐ పాస్ భారత దేశానికే ఆదర్శంగా నిలిచింది
పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో వేలాది మందియువతకు ఉపాధి
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె. తారకరామారావు

హైదరాబాద్ (షాబాద్) : ఉత్పత్తి రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శమని ,ఆదేశానికి వెళ్లిన ప్రతిసారి కొత్త అంశాలను నేర్చుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌పల్లి పారిశ్రామిక వాడలో జపాన్‌కు చెందిన డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌కు , నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీలను ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. టీఎస్ ఐ పాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలిచి జపాన్ సత్తా చాటిందన్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లో ఆదేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఆదేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. డైపుకు కంపెనీ దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆసంస్ద రూ . 575 కోట్ల పెట్టుబడితో ప్రారంభించినట్లు మూడు నెలల్లో పరిశ్రమ ప్రారంభ కానుందనది, చందన్‌పల్లికి వెల్‌స్పన్, మైక్రోస్టాప్ సహా అనేక సంస్ధలు వస్తాయని వెల్లడించారు. ఈకంపెనీ ద్వారా ప్రత్యేక్షంగా 1600 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

భారత్‌కు చెందిన వెగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీతో కలిసి డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ కంపెనీ ఎక్విప్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తుందన్నారు. మొదటి విడుతలో రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, దీని ద్వారా 800 మందికి జీవనోపాధి లభిస్తుందని, మొదటి దశలో 250 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనిలో కన్వేయర్స్, షార్టర్స్ ఉత్తత్తి చేయనుందని చెప్పారు. అదే విధంగా నికోమాన్ తైకిషాకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, నిర్మాణ రంగానికి చెందిన క్లీన్ రూం ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు. హెచ్‌వీఏసీ సిస్టమ్స్‌ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో రూ. 126.20 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తుందని, దీనికి సంబంధించి ప్రభుత్వంతో గతేడాదిలో ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు.

వికారాబాద్ జిల్లాలోని ఐటీఐని ఈ సంస్థ దత్తత తీసుకుని ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్కిల్స్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే చందన్‌వెళ్లి పారిశ్రమిక వాడలో ప్రతిష్టాత్మకమైన అమెజన్, వెల్‌సన్, కటురా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అలాగే సీతారాంపూర్‌లోని పారిశ్రమిక వాడలో మరో పరిశ్రామిక కంపెనీ అయిన వోలెక్ట్రా ఎలాక్ట్రనిక్ వెహికిల్ ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు త్వరిత గతిన అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో షాబాద్ మండలం ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జపాన్ కాన్‌సోలేట్ జనరల్ మైసూకితాగా, ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల , చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయష్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, షాబాద్, మొయినాబాద్ జడ్పీటీసీలు పట్నం అవినాష్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News