Monday, January 20, 2025

ఖాకీ కాల్పుల్లో ఒడిశా మంత్రి మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశాలోని బ్రజరాజ్‌నగర్‌లో ఆదివారం ఉదయం ఎస్‌ఐ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి, అధికార బిజూ జనతాదళ్ సీనియర్ నేత నబకిశోర్ దాస్ కన్ను మూశారు. భాగంలో తూటా దూసుకు పోవడంతో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్లు భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యలు వెల్లడించారు. తొలుత ఆస్పత్రికి తీసుకు రాగానే డాక్టర్ దేబశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది.అయినప్పటికీ ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన తూటా గుండె ఎడమవైపు ఊపిరితిత్తుల భాగంలో గాయం చేయడం తో తీవ్రమై రక్తస్రావం జరగడంతో ఆయనను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజు నగర్‌లోని గాంధీచౌక్ వద్ద ఓ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడం కోసం మంత్రి ఆదివారం ఉదయం అక్కడికి వచ్చారు. మంత్రి కారు డోరు తీసుకుని దిగుతుండగా ఎఎస్‌ఐ గోపాల్‌దాస్ ఆయనపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో మంత్రి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా మంత్రిపై కాల్పులు జరిపిన ఎఎస్‌ఐ గోపాల్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రిపై అతను ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు తెలిపారు. కాగా దాస్ మానసిక స్థితి సరిగా లేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అపోలో ఆస్పత్రికి వెళ్లి మంత్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును చేపట్టవలసిందిగా క్రైమ్‌బ్రాంచ్‌ని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. దాడి విషయం తెలియగానే బిజెడి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఝార్సుగూడ ప్రాంతంలో మైనింగ్ వ్యవహారాల్లో బలమైన నాయకుడైన కిశోర్ దాస్ 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌నుంచి బిజెపిలోకి ఫిరాయించారు.

ఒడిశాకు తీరని నష్టం : నవీన్ పట్నాయక్

మంత్రి నబకిశోర్ దాస్ మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర షాక్‌కు,ఆవేదనకు గురి చేసిందన్నారు.ఆయనను కాపాడేందుకు డాక్టర్లు చేయాల్సినదంతా చేశారని, కానీ ఆయన కోలుకోలేకపోయారన్నారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి ఆయన గొప్ప ఆస్తి అని, ఆరోగ్య శాఖలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు లబ్ధి చూకూరేందుకు కృషి చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News