Monday, January 27, 2025

ఆన్‌లైన్ టిఫిన్ సర్వీస్ పేరిట మహిళకు రూ. 89 వేలు టోకరా

- Advertisement -
- Advertisement -

 

ముంబై: టిఫిన్ డెలివరీ సర్వీసుకు ఫోన్ చేసి ఒక మహిళ రూ. 89,000 మోసపోయింది. టిఫిన్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్‌నని చెప్పి సైబర్ స్కామ్‌స్టర్ ఆమెను బురిడీ కొట్టించాడు. ముంబైలోని చౌక్‌లో నివసించే ఒక 53 ఏళ్ల మహిళ డిసెంబర్ 5న ఆన్‌లైన్‌లో టిఫిన్ డెలివరీ సర్వీస్ పేరుతో ఉన్న ఒక నంబర్‌కు ఫోన్ చేసింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఆమెకు రిజిస్ట్రేషన్ లింక్‌తో ఒక ఇమెయిల్ పంపుతానని, ఆ సర్వీసుకు సైన్ చేసి రూ. 5 యాక్టివేషన్ ఫీజును చెల్లించాలని కోరాడు. ఆమె ఆ ప్రకారమే చేయగా ఆమె బ్యాంకు ఖాతాలోనుంచి రూ. 89,000 డెబిట్ అయిపోయాయి. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అనుమానాస్పదంగా ఉండే ఎటువంటి అప్లికేషన్ లు లేదా రిక్వెస్ట్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News