Friday, January 3, 2025

రానున్న పాతికేళ్లలో సుసంపన్నదేశంగా సాధనకు కృషి : మోడీ

- Advertisement -
- Advertisement -

కేవడియా (గుజరాత్): ఈ శతాబ్దం లో రానున్న 25 సంవత్సరాలు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. గుజరాత్ లోని కేవడియాలో వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు.దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు ప్రతిభారతీయుడు పాతికేళ్లు స్వాతంత్య్రం సాధించడానికి తనకు తాను అలసిపోయాడని, అదే విధంగా దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దడానికి రానున్న 25 ఏళ్లు ‘అమృత కాలాన్ని’ సాధించుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. పటేల్ స్ఫూర్తితో ప్రతి లక్షాన్ని సాధించుకోవాలన్నారు.

ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ కశ్మీర్, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370 గోడ కూలిపోయిందని, ఈ విషయంలో సర్దార్ ఎక్కడున్నా సంతోషిస్తారన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లో భారీస్థాయిలో యూనిటీ డే పరేడ్‌ను నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను వీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News