Sunday, December 22, 2024

వచ్చే బడ్జెటులో బిసిలకు రూ. 20 వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సీఎం భట్టిని కోరిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం బిసిల బడ్జెట్ రూ. 20వేల కోట్లకు పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం సచివాయలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి చర్చలు జరిపినంతరం సచివాలయంలోని మీడియా కేంద్రంలో మాట్లాడుతూ బిసి కార్పొరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి, బి.సి బందు పధకం ప్రవేశ పెట్టాలన్నారు. అదే విధంగా ఎంబిసి కార్పొరేషన్ కు రూ. 2 వేల కోట్లు, 12 బి.సి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో రూ. 2 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్,ఎంబీఏ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బిసి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని కోరారు.

రాష్ట్రంలో బిసిల జనాభా 52 శాతం ఉన్నట్లు సమగ్ర సర్వేలో తేలిందని, 2014కు పూర్వం కాంగ్రెస్ హయాంలో బిసిల బడ్జెట్ మొత్తం బడ్జెట్ కేటాయింపులో 3.5 శాతం వరకు ఉండేదిదని దానిని గత ప్రభుత్వం తగ్గించిందన్నారు. ప్రత్యేక శ్రద్ద తీసుకొని బిసిలకు మొత్తం బడ్జెట్‌లో బి.సిలకు 20 వేల కోట్లు కేటాయింపులు చేయాలన్నారు. ఈసమావేశంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, కోట్ల శ్రీనివాస్, పి. సుధాకర్, రేగుల మధుసూదన్, టి. రాజ్ కుమార్, రాజేందర్, ఎం. పృధ్వీ గౌడ్, పల్లగొర్ల మోడిరాందేవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News