Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికలలో పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

ఇవ్వని పార్టీలను ఓడిస్తామని 13 బిసి సంఘాల హెచ్చరికలు

మన తెలంగాణ/హైదరాబాద్ : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని 13 బీసీ సంఘాలు డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీలు బిసిలకు టికెట్లు ఇస్తే గెలిపించుకునే బాధ్యత బీసీలదేనని మీరు టికెట్లు ఇవ్వండి ఎలా గెలిపించుకోవాలో మేము చూసుకుంటామని రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బిసిలు 50 శాతం కు పైగా ఉన్నారని రాష్ట్రంలో బిసి వాదం బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలకు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారన్నారు. ఆదివారం వారు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పార్టీ 70 అసెంబ్లీ స్థానాలు బిసిలకు కేటాయించాలని, లేనిపక్షంలో బిసిలు తిరగబడతారని హెచ్చరించారు. 50 శాతం టికెట్లు ఇవ్వకపోతే ఆ పార్టీలను ఓడిస్తామని హెచ్చరించారు.

అన్ని రాజకీయ పార్టీలు బిసిలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప బీసీలకు అన్ని రంగాలలో ప్రజాస్వామిక వాటా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన రాజకీయ రంగాలలో బీసీల ప్రాతినిధ్యం 15 శాతం దాటలేదు. మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లకు బిసిలు కేవలం 21 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాల నుంచి ఒక్క బిసి శాసనసభ్యులు లేరు. ఇంత అన్యాయం జరుగుతున్న బిసిలను పట్టించుకునే దిక్కులేదు. బిసి జాబితాలో 130 కులాలు ఉంటే 115 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గేట్ దాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పారిశ్రామిక రంగంలో ఆర్ధిక రంగంలో, ఒక స్థాయి దాటిన వాణిజ్య రంగంలో ఒక స్థాయి దాటిన ప్రభుత్వ కాంట్రాక్టులు తదితర సిమిలర్ రంగాలలో పూర్తిగా తమ వాటా కోల్పోతున్నారు. విచిత్రమేమిటంటే వీటన్నింటి నిర్వహణ పూర్తిగా బిసిలే అయితే ఫలాలు మాత్రం అగ్ర కులాలు అనుభవిస్తున్నారని మండి పడ్డారు. రిజర్వేషన్లు లేని ఎమ్మెల్సీ పదవుల్లో 90శాతం అగ్ర కులాలే ఉన్నారని అధికారంలో ఉన్న పార్టీలు, కమ్మ, రెడ్లు, వెలమలే ఉండటం కారణంగా రాష్ట్ర బడ్జెట్లోని వినియోగంలో పరిశీలిస్తే నీటి పారుదలకు సంబంధించి దాదాపు 2 లక్షల కోట్లు కాంట్రాక్టులు కేవలం ఒక్క కులానికి వచ్చాయని ఆరోపించారు. ఈ సమావేశానికి గుజ్జ కృష్ణ , నీల వెంకటేష్ , కోట్ల శ్రీనివాస్, వేముల రామ కృష్ణ , టి. రాజ్ కుమార్, భూమన్న, మంజుల గౌడ్, ప్రసాద్, మోడి రాందేవ్ , హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News