Friday, January 24, 2025

విజయదశమి స్ఫూర్తిగా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ దసరా శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం పేర్కొన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని అన్నారు. దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండవర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సిఎం అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సిఎం కెసిఆర్ దుర్గామాతను ప్రార్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News