Monday, January 20, 2025

సమైక్య రాష్ట్రంలో కవులు, కళాకారులకు గుర్తింపు కరువు

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : సమైక్య రాష్ట్రంలో కవులు, కళాకారులకు అ ప్పటి ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వలేదని, స్వ రాష్ట్రంలో కవులను, కళాకారులను ప్రత్యేకంగా గౌరవించుకుంటున్నామని రాష్ట్ర టూరిజం కార్పొరేష న్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యం లో గానస భలోని కళావెంకటదీక్షితులు కళావేదికలో భక్తి, సంగీత గాన గోష్టి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శ్రీనివా స్‌గుప్తా పాల్గొని మాట్లాడుతూ.. తె లంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు.

ప్ర త్యేక రాష్ట్రం సిద్ధించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదోవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటే విధంగా దశాబ్ది వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో కవులు, కళాకారులను గుర్తించి పదవులు, ఉద్యోగాలు కల్పించిన ఘ నత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సత్కరించి, అభినందించారు. ఈ కార్య్ర మంలో కోలేటి దామోదర్ గుప్తా, రా మదాస్, శ్రీధర్, అంజనీ, అరుణ్, సంస్థ అధ్యక్షుడు గాంధీలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News