Monday, December 23, 2024

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పాతాళంలోకి…

- Advertisement -
- Advertisement -
  • రేవంత్‌రెడ్డి పిసిసి చీఫ్‌గా కొనసాగితే మెజార్టీ స్థానాలు బిఆర్‌ఎస్‌వే
  • గ్రామాల్లో రైతులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండించాలి
  • రేవంత్‌రెడ్డి సిఎం అవుతావని పగటి కలలు మానుకో: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

కౌడిపల్లి: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పాతాళంలోకి పోవడం ఖాయమని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పగటి కలలు కంటున్నాడని యావత్ తెలంగాణ రైతాంగంవచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్దినిచెప్పి కాంగ్రెస్‌ని పాతాళంలోకి తొక్కుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తునికి గేటు వద్ద రైతు వేదికలో మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు సార రామాగౌడ్ ఆధ్వర్యంలో రైతు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సాదించాక ఆంద్రపాలకులు కరెంట్ తెలంగాణకు కష్టాలు తప్పవని ఎద్దెవా చేశారన్నారు. ముఖ్యమంత్రి చేశారన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ సాహోసేపేత నిర్ణయంతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతన్నలకు24 గంటల ఉచిత కరెంట్, ఎరువులు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు, రైతుబందు,రైతుభీమా ఇలా మరన్నోసంక్షేమ అభివృద్ధి పథకాలద్వారా తెలంగాణరైతన్నను రాజుగా మారుస్తుంటే ఓర్వలేనికాంగ్రెస్ విషం కక్కుతుందని ఆయన అన్నారు. పిసిసి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతానని పగటికలలు కంటున్నాడని ఆ కలగానే మిగిలిపోతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తుందనిఆయన అన్నారు.కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహులన్నారు.భారతదేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని వాటిద్వారా ప్రజానికం సుఖసంతోషాలతో పది సంవత్సరాలుగా ఉంటే రైతులను కించపరిచే విధంగా మూడుగంటల విద్యుత్ ప్రస్తావన చేసి తెలంగాణ రైతులను ఆగౌరవపరచాలని అన్నారు.

ప్రతిపక్షాలకు కెసిఆర్ కుటుంబాన్ని తిట్టడం ద్వారానేపబ్బం గడుపుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోరైతులుమూడు పంటలు పండిస్తుంటే మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ రైతులపై వివక్ష చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజు నాయక్, చిలప్‌చె డ్ ఎంపిపి వినోదదుర్గారెడ్డి, తునికి నల్లపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ లాక్య నాయక్, సాయిలు, శేకులు, చంద్రశేఖర్‌గుప్తా, శ్రీజ గణేష్, పద్మకిష్టయ్య, నాయకులు మహిపాల్‌రెడ్డి, నర్సింగరావు, శ్యాసుందర్‌రావు, నాయికోటి లింగం, మాణిక్యరెడ్డి, శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్ర తాప్‌గౌడ్,రాజు, నర్సింలు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News