Thursday, January 23, 2025

రానున్న ఎన్నికల్లో ప్రజలే తరిమి కొడతారు

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలే తిరిగి మూడోసారి తరిమికొడతారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక నెహ్రు విగ్రహం పక్కన గల స్థలంలో ఏర్పాటు చేయనున్న అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారు నేడు విమర్శలు చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుల్తానాబాద్‌లో మాజీ సర్పంచ్ తెలంగాణ ఉద్యమకారుడు పారుపల్లి వైకుంఠపతి తెలంగాణ కోసం ఎక్కడ లేని విధంగా రిలే నిరాహార దీక్షలను కొనసాగించారని గుర్తు చేశారు.అనంతరం అమరవీరుల ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, ఎంపీపీ బాలాజీరావు, మున్సిపల్ కమీషనర్ రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమతా కృష్ణ, కౌన్సిలర్లు పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి, పసిడ్ల మమత సంపత్, కూకట్ల గోపి, గుర్రాల శ్రీనివాస్, గొట్టం లక్ష్మి, రేవెల్లి తిరుపతి, అనుమాల అరుణ బాబురావు, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, గాజుల లక్ష్మిరాజమల్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్, యూత్ నాయకులు వాయిద్, కనవెన సతీష్, గొట్టం మహేష్, బండి సంపత్, గెల్లు శ్రీనివాస్, సర్వర్, నల్ల పోచమల్లు, ఆరెపల్లి సరేష్, సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గట్టు శ్రీనివాస్, శీలం శంకర్, సోషల్ మీడియా ఇంచార్జి రఫిక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News