Saturday, January 25, 2025

షాబాద్, కుమ్మరిగూడ గ్రామాల్లో ఘనంగా బోనాలు

- Advertisement -
- Advertisement -

షాబాద్ : షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, షాబాద్ గ్రామాల్లలో ఘనంగా పోచ్చమ్మ బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాని విద్యుత్ దీపాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన్నట్లు తెలిపారు. గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. బోనాలు ఊరి పూరవీధులో ఊరేగిస్తూ శివసత్తులతో, పోతురాజుల విన్యాసాలతో అమ్మ వారికి సమర్పించారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పంటలు బాగా పండి ఊరు బాగుండాలని మొక్కులు తీర్చుకున్నారు. అందరిని చల్లంగా చూడు తల్లి అంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News