Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఆ అయిదు రాష్ట్రాల్లో బరిలోకి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలయిన చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ చూపించదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు మిగతా రెండు రాష్ట్రాలు అయిన తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉమ్మడి నాయకత్వంపై ఆధారపడుతుందని ఆ వర్గాలు తెలిపాయి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు చెలరేగుతన్న నేపథ్యంలో బిజెపి వ్యూహానికి సంబంధించి తాజా పరిణామం వెల్లడి కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న 64 ఏళ్ల శివరాజ్ సింగ్ చౌహాన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పి కొట్టేందుకు పార్టీ ఆయనను పక్కన పెట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ కోణంలోనే ‘ఉమ్మడి నాయకత్వం’ అనే సందేశాన్ని , ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే కొత్తగా ఎన్నికయిన శాసన సభ్యులే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనే విషయాన్ని పారీ ్టతెరపైకి తెచ్చిందని అంటున్నారు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్న రాజస్థాన్‌లో సైతం బిజెపి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగబోతోంది. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తిరుగులేని నేత అయిన వసుంధరా రాజె సింధియా మరోసారి ముఖ్యమంత్రి బరిలో ఉంటారని బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News