- మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్
సిద్దిపేట అర్బన్: వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలో పర్యటిస్తున్న సమయంలో 31వ వార్డులో బాల హనుమాన్ దేవాయలం వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఛాంబర్‌లో చెత్త తట్టుకొని నీరు నిలిచిపోవడం గమనించిన కమిషనర్ వెంటనే యూజీడి సిబ్బందిని సంబంధిత స్థలానికి పిలిపించి ఛాంబర్‌లో చెత్త తొలగింపజేచేశారు.
వర్షం కారణంగా ఎక్కడ నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్లకు , జవాన్ లకు ఆదేశాలు జారీ చేశారు. మెయిన్ రోడ్డు వైపున ఫుట్ పాత్ పక్కన గల చుట్ డ్రైన్‌లలో చెత్త లేకుండా నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలన్నారు.
పట్టణంలోని మురికి కాలువలో నీరు నిలవకుండా సిల్ట్ తొలగించాలని ఆదేశించారు. వర్షం కారణంగా ఎక్కడైనా శిథిలావస్థకు చేరిన గృహాలలో ఎవరైన నివాసం ఉంటే వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని తెలపాలని టెలి కన్ఫరెన్స్ ద్వారా సిబ్బందిని ఆదేశించారు.