Monday, December 23, 2024

వికారాబాద్ లో రూ. 92 కోట్లతో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సిఎం హామీ

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : వికారాబాద్‌లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సిఎం కెసిఆర్ అంగీకరించారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వెల్లడించారు. మంగళవారం సిఎం కెసిఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లను వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. వికారాబాద్‌లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఎమ్మెల్యే ప్రస్తావించగా, వెంటనే సిఎం కెసిఆర్ సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఫైల్ పంపించాలని ఆదేశించి, రూ.92 కోట్లతో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. చీఫ్ సెక్రటరీ, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో వికారాబాద్‌లో జరగాల్సిన పలు అభివృద్ధి అంశాలపై ఫోన్‌లో మాట్లాడి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News