యాదాద్రి భువనగిరి: యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వర్షం వస్తై చాలు భక్తులకు హరి గోస తప్పడం లేదని భక్తులు, స్థానిక ప్రజలు అంటున్నారు. యాదాద్రి అభివృద్ధ్దిలో ఆలయ నిర్మాణం గోప్పగా జరిగిన శ్రీ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మాత్రం అడుగాడుగున అసౌకర్యాలు కలుగుతున్నాయని భక్తులు తెలుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కురిసన వర్షంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పిల్లపాపలతో కొండపైకి వెళ్లడానికి, అపై దర్శనం చేసుకోవడానికి వెళ్లిన భక్తులకు ఏక్కడ నిలువ నీడలేకపోవడంతో ఉరుకులు పరుగులతో వర్షంలో తడుస్తు శ్రీ లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు.
ఏంతో దూర ప్రాంతాల నుంచి శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడవలసి వస్తూందని భక్తులు అంటున్నారు. దర్శన క్యూలైన్లులో కూడ వర్షపు నీటితో భక్తులు తడవక తప్పడలేదంటున్నారు. శ్రీ వారి దర్శనార్ధం కొండకింద తమ వాహనాలు పార్క్ చేసుకొని ఉచిత బస్సు ద్వార కొండపైకి వెళ్లిన భక్తులకు వర్షం తో వచ్చిన వరద నీటితో పార్కింగ్‌లో ఉన్న తమ వాహనాలు, కార్లు, ఆటోలు వరద నీటలో ఉండటం చేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో మునిగిన వహనాలవద్దకు వెళ్లలేక, అక్కడి నుంచి వాహనాలు తీయలేక భక్తులు దేవుడ ఏంటి తీప్పలు అంటూ బాదపడ్డారు. వర్షం వచ్చినప్పుడల్ల ఏదో ఒక్క సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడుతున్న ఆలయ అధికారులు సమస్యలను పరిష్కరించడంలో విపలం అవుతున్నరని, ఆదాయం ఒక్కటే మార్గంగా ఆలయ అధికారుల తీరు కనబడుతుందని భక్తులు, స్థానికులు అంటున్నారు.