Saturday, December 21, 2024

వచ్చే 15 ఏళ్ల జనాభాకు సరిపోను అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: నగరం రోజురోజుకు విస్తరిస్తుండడం జనాభా అంతకు అంతా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు అంతే స్థాయిలో పెరిగాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యల నుంచి నగరవాసులకు పూర్తి ఉపశమనం కల్పించడమే లక్షంగా పురపాలక శాఖమంత్రి కెటిఆర్ ఆలోచనలో నుంచి పురుడుపోసుకున్న వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధ్ది ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డిపి) ద్వారా సిగ్నల్ రహిత రోడ్లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ కింద రూ.5,937 కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో 33 పనులు (17 ఫ్ల్లైఓవర్లు 5 అండర్ పాస్‌లు, 7 ఆర్వోబీలు/ఆర్.యూ.బీలు, 1 తీగెల వంతెన, పంజాగుట్టలో 2 ఉక్కు వంతెనలు) ఇప్పటికే పూర్తి అయ్యాయి. దీంతో నగరంలో ఎల్‌బినగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌జోన్లలో 80 శాతం మేర ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాగా, రెండవ దశలో కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం లభించనుంది. అభివృద్ధి చేసిన రహదారులను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం ద్వారా ప్రజలకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల్లో మూడొంతుల మంది నిత్యం ఉపయోగించే ప్రధాన రోడ్ల మార్గాల్లో 719 కిలో మీటర్ల పొడవు మేర రోడ్లను రూ.1839 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అంతేకాకుండా వర్షాకాలంలో చినుకు పడితే చాలు తరుచు వరద ముంపునకు గురువుతున్న నగరంలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే లక్షంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ ఎన్డీపీ) రూపకల్పన చేసి తద్వారా రూ.985 కోట్లతో 56 నాలాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో చాలా మేరకు ఆ పనులన్నీ పూరైయ్యాయి. ప్రధాన మార్గాలపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా నగవాసులకు ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపు లక్షంగా (హెచ్‌ఆర్ సీఎల్) ద్వారా మిస్సింగ్ లింకు రోడ్ల నిర్మాణానకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో 44 కి.మీ. పొడవైన మిస్సింగ్ 33 లింకు రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 21 లింకు రోడ్ల నిర్మాణం పూర్తవగా, మరో 11 రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన చౌరస్తాలో రోడ్లు దాటాలం పాదచారుల ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు హెచ్‌ఎండిఎ సహకారంతో జీహెచ్‌ఎంసీ రూ.76.65 కోట్ల వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది. వీటిలో 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తవగా, మిగతా 15 చోట్ల పనులు శరవేగం కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News