Monday, December 23, 2024

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి ఇనాక్ : గవర్నర్

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి కొలకలూరి ఇనాక్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇనాక్ రచిం చిన రచనలు ప్రభుత్వాలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో జరుగుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహంలో భాగంగా ఇనాక్ రచించిన ‘వలస’ నవల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి త్యాగరాయగానసభ ప్రధాన వేదికపై నిర్వహించారు.

కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరై నవలను ఆవిష్కరించి, ప్రసంగించారు. సమాజంలో ఉన్న వివక్షత, సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించిన వారే నిజమైన సాహితీవేత్తలు అన్నారు. ఇనాక్ రచనలు పేద, దళిత బాధలు అని, ఇనాక్ సాహిత్యం మానవీయ విలువల ప్రతీకలని అన్నారు. వలస నవలలో.. వలస కార్మికులు పాదచారులుగా కరోనా సమయంలో వారి ప్రాంతాలకు వెళ్లిన ఉదంతం వాస్తవానికి దృశ్యం అని అన్నారు. ఆయన విద్యావంతుడై ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తల్లి ప్రేరణ కాగా తనకు.. తన తల్లి దేశం కోసం పని చేయమని ప్రోత్సాహించారని గుర్తు చేసుకున్నారు. ఇనా క్‌కు ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీ వచ్చినా… ఇంకా ఎంతో ఉన్నతమైన పదవి, గౌరవం పొందాలని గవర్నర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ కొలకలూరి ఇనాక్ విశ్వకవి అన్నారు.

ఆయన సాహిత్యం నేటి పిల్లలకు చేరువ చేస్తే మంచి మనుషులుగా సమాజానికి అందించిన వారు అవుతారని వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. పి.రవీందర్ మాట్లాడుతూ.. భారతీయ సాహిత్యంలోకి ఇనాక్ రచనలు నిలుస్తాయని అన్నారు. కరోనా కాలపు అమానవీయ పరిస్థితులకు అద్దం వలస నవల అన్నారు. త్యా గరాయగానసభ అధ్య క్షుడు కళా జనా ర్ధనమూర్తి సభాధ్యక్షత వహించిన సభలో సాహితీవేత్త ఆచార్య చెన్నకేశవరెడ్డి, శ్రీమణి తదితరులు పాల్గొన్నా రు. సభకు తొలుత రత్న మాల శిష్యులు సంగీత గోష్టి శ్రావ్యంగా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News