Monday, December 23, 2024

ఇనాక్ కవితా సంపుటి ‘విశాల శూన్యం’ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలక లూరి ఇనాక్ సాహితీ సప్తాహంలో భాగంగా మంగళవారం ఇనాక్ రచించిన ‘విశాల శూన్యం’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్ర మం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారీ పాల్గొని గ్రంధాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. అనుకూల పరిస్థితుల్లో సంఘర్షణల మధ్య… జీవితాన్ని శిల్పంగా చేక్కుకొని ఇనాక్, మాగురువు జయశంకర్‌కు అభిమాని అని కొనియాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అధ్యక్షత వహించిన సభలో కవి బిక్కి కృష్ణ, రాజగోపాల్, ఉప్పల శ్రీనివాస్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. మల్లాది ఉష బృందం గానం ఆకట్టు కుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News