Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి…. శవం పక్కన ఏడుస్తున్న రెండేళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలోని ఇనాంగూడ వద్ద ఓ తండ్రి  రెండు సంవత్సరాల కుమారుడితో కలిసి గురువారం ఉదయం పాల ప్యాకెట్ తీసుకరావడానికి బైక్ పై వెళ్తుండగా వారిని డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడిక్కడే మృతి చెందగా కుమారుడు గాయపడ్డాడు. పాపం పసిబాబుకి ఏమి తెలియకపోవడంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. బాబు ముఖంపై గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News