Sunday, January 19, 2025

డిప్యూటి సిఎం పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి దువ్వాడపై కేసు
మన తెలంగాణ/హైదరాబాద్ : వైసిపి ఎంఎల్‌సి దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

పోసానిపై సిఐడి కేసు

సినీ నటుడు పోసాని కృష్ణమురళీ పై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 9న తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. పోసానిపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61 (2) బిఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 28 వ తేదీన పోసాని కృష్ణమురళీ సీఎం చంద్రబాబును కించపరిచేలా ఉద్దేశపూర్వకం ప్రసారమాథ్యమాల్లో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో వెల్లడించారు. వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని పత్రికా సమావేశంలో పోసాని ఆరోపించినట్లు వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News