Wednesday, January 22, 2025

రైతులపై అనుచిత వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డికి తగదు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మండలంలోని రాఘవాపూర్ రైతు వేదికలో రాఘవాపూర్, అందుగులపల్లి, గౌరెడ్డిపేట, రంగాపూర్, దేవునిపల్లి, సబ్బితం గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అరిగోస పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.

అన్ని రకాల వసతులు కల్పిస్తున్న బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై తిరగబడాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఎటు చేసినా ఎండి పంటలు, బీళ్లు వారిన పొలాలే కనిపించాయని, ఇప్పుడు చుట్టు నీళ్లు, పచ్చని పంట, పొలాలు, 24 గంటల కరెంటుతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు.

మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో… మూడు పంటలకు నీళ్లు అందించే సీఎం కేసీఆర్ కావాలో రైతులు నిర్ణయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, సర్పంచ్‌లు సది, శారద శ్రీనివాస్, ఎంపీటీసీలు శ్రీనివాస్, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ రామస్వామి, మాజీ ఎంపీటీసీ సదయ్య, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్న బాబు, మహేందర్, సదయ్య, రైతు సమితి గ్రామ కోఆర్డినేటర్‌లు గాండ్ల సదయ్య, ఉపసర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News