Monday, December 23, 2024

ప్రారంభ‌మైన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ..హాజరైన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ 2023 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. స్థానిక సెయింట్ థామ‌స్ స్కూల్ నిర్వ‌హిస్తున్న‌ వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఎగ్జిబిట్లను తిలకించి అభినందించారు.

వాటికి సంబంధించిన వివరాలను విద్యార్థులు, గైడ్‌ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వ‌హించిన‌ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ విజేతలతో పాటు గైడ్ టీచర్లు ఈ సైన్స్ ఫేర్ లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ పారూఖీ అలీ, జిల్లా విద్యా శాఖ అధికారి ర‌వింద‌ర్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News