Sunday, December 22, 2024

ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆగ్రా : ఆగ్రా మెట్రో ప్రాథమ్య కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర నేతలు తొలి రైలులో తాజ్ మహల్ స్టేషన్ నుంచి తాజ్ మహల్ ఈస్ట్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఆరు కిలో మీటర్ల కారిడార్‌లో మెట్రో సర్వీసులు ప్రయాణికులకు గురువారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఆ మార్గంలో ఐదు చోట్ల రైలు ఆగుతుంది.

ప్రధాని కోల్‌కతా నుంచి రిమోట్‌గా ప్రారంభించిన ప్రాథమ్య కారిడార్‌లో మూడు ఎలివేటెడ్ స్టేషన్లు, మూడు అండర్‌గ్రౌండ్ స్టేషన్లు ఉంటాయని అధికార ప్రకటన వెల్లడించింది. తాజ్ మహల్ స్టేషన్‌లో ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, స్థానికులకు, నగరాన్ని సందర్శించే పర్యాటకులకు ప్రపంచ శ్రేణి సార్వత్రిక రవాణా సౌకర్యాన్ని ఆగ్రా మెట్రో కల్పిస్తుందని తెలియజేశారు. ‘ఆగ్రా ఉత్తర ప్రదేశ్‌లోని అత్యంత పురాతన నగరాలలో ఒకటి. ఇది ‘బ్రజ్ భూమి’లో భాగం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్య సాహసాల గాథలతో నగరానికి అనుబంధం ఉన్నది’ అని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ 2020 డిసెంబర్ 7న ఆగ్రా మెట్రోకు శంకుస్థాపన చేశారని, ఇది నిర్ణీత గడువుకు తొమ్మిది నెలలు ముందుగానే, అంటే 23 నెలల్లో పూర్తి అయిందని ముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News