Saturday, November 23, 2024

రేపు ఎసిఎస్ నగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఎసిఎస్ నగర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే గోప్ప లక్షంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను గురువారం ఎసిఎస్ నగర్ కాలనీలో ప్రారంభం కానున్నాయి. దీంతో నిరు పేదల ఆత్మగౌరవ లోగిళ్లు (డబుల్ బెడ్ రూం )ల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న నగరవాసులకు మరిన్ని ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి.

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రూ.3.72 కోట్ల వ్యయంతో నిర్మించిన 48 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు ప్రారంభించనున్నారు. జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News