Monday, January 20, 2025

మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ గ్రౌండ్ లో TS STEP (తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్) నేతృత్వంలో ఈ నెల – 22 న మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నారు. వందకు పైగా పెద్ద కంపెనీలలో సుమారు పది వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎర్పాటు చేస్తున్న ‘మేగా జాబ్ మేళా‘ పోస్టర్ ను కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కెపి వివేకానంద గౌడ్ తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం రాష్ట్ర సచివాలయం లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ – టిఎస్ స్టేప్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 18వ మెగా జాబ్ మేళా ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో వందకు పైగా కంపెనీలతో 10 వేల మందికి పైగా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సీఎం కేసీఆర్ సహకారంతో ‘భారీ జాబ్ మేళా‘ ను నిర్వహిస్తున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ యువజన సర్వీసుల శాఖ -ఆధ్వర్యంలో ఉన్న 9 ఆధునిక శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ను ఇచ్చి సుమారు 45 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, పరిశ్రమల ఐటి శాఖల మంత్రి కేటీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణ యువజన సర్వీసుల శాఖ టిఎస్ స్టేప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వివిధ రంగాలలో యువతీ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాల కల్పనలో భాగంగా ట్రాన్స్ జెండర్ లకు, చెవిటి మూగ వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు.

7వ తరగతి నుండి ఆపై ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిప్లమా హోల్డర్స్, బి ఫార్మ , ఎం ఫార్మా ,హోటల్ మేనేజ్మెంట్ ,డ్రైవర్స్, బి ఈ , బిటెక్ , ఎంటెక్ , బి ఏ, బిఎస్‌సి , బీకాం, ఎంబీఏ , ఎంసీఏ, ఎంసీఏస్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ అపై చదివిన వారు ఈ జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ మెగా జాబ్ మేళా లో అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన 7097655912 నెంబర్ హెల్ప్ లైన్‌ను మెగా జాబ్ మేళాలో పాల్గొనే వారు సంప్రదించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండి వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News