Monday, December 23, 2024

సాకారమవుతున్న సమీకృత పాలన

- Advertisement -
- Advertisement -

ప్రజలకు ఒకేచోట
అందుబాటులోకి
ప్రభుత్వ సేవలు
25న రంగారెడ్డి కలెక్టరేట్, 29న
పెద్దపల్లి, 5న నిజామాబాద్, 10న
జగిత్యాల జిల్లా కార్యాలయాలను
ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు,
బహిరంగ సభలకు
ఇప్పటికే అందుబాటులోకి
తొమ్మిది కలెక్టరేట్లు
అక్టోబర్‌లో మిగతావి
ప్రారంభించేందుకు సన్నాహాలు

ఊపందుకున్న నూతన కలెక్టరేట్ల భవన ప్రారంభోత్సవాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉం డేలా అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈనెల, వచ్చేనెలలో మరిన్ని సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2021 సంవత్సరంలో నాలుగు కలెక్టరేట్లను ప్రారంభించిన కెసిఆర్, 2022లో ఐదు కలెక్టరేట్‌లను సైతం ఇప్పటికే ప్రారంభించారు. మరోనాలుగు కలెక్టరేట్‌లను ఈనెలలో, వచ్చే నెలలో కెసిఆర్ ప్రారంభించనుండగా మిగిలినవి అక్టోబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణంతో జిల్లా కార్యాలయాలన్నీ ఒకేచోట ఉంటాయని, దీనివల్ల అధికారులందరూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.

గతంలో జిల్లా కార్యాలయాలన్నీ వేరువేరుగా ఉండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాను నిర్మించి అందులో అన్ని జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో సమీకృత కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి రాగా మరికొన్ని ప్రారంభానికి సిద్ధమయ్యా యి. పలు జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు సమీకృత భవనాల ప్రారంభోత్సవాలకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో ఇప్పటికే వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన సిఎం ఈనెల 25వ తేదీన (కొంగర్‌కలాన్‌లో) నిర్మించిన రంగారెడ్డి కలెక్టరేట్‌తో పాటు ఈనెల 29న పెద్దపల్లి కలెక్టరేట్‌లను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది.

ఇదే నెల 29వ తేదీన పెద్దపల్లి జిల్లాలో సిఎం పర్యటించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్ 10న జగిత్యాల కలెక్టరేట్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. దీంతోపాటు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మహబూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాలోని సమీకృత కలెక్టరేట్‌లను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ప్రారంభించుకున్న సమీకృత కలెక్టరేట్ భవనాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ భవనాన్ని జూన్ 20వ తేదీ 2021న, కామారెడ్డి కలెక్టరేట్ జూన్ 20న, హన్మకొండ కలెక్టరేట్‌ను జూన్ 21న, రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ను జూలై 04వ తేదీన, జనగాం కలెక్టరేట్‌ను ఫిబ్రవరి 11వ తేదీ 2022 సంవత్సరంలో, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ను ఫిబ్రవరి 12వ తేదీన, వనపర్తి కలెక్టరేట్‌ను మార్చి 08వ తేదీన 2022, వికారాబాద్ కలెక్టరేట్, మేడ్చల్ కలెక్టరేట్‌లను 2022, ఆగష్టు నెలలో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

సిఎం సభా స్థలి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 29న లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లిలో సిఎం కెసిఆర్ సభ నిర్వహించే సభాస్థలిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఆదివారం మంత్రులు పరిశీలిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తారని వారు పేర్కొన్నారు. అందులో భాగంగా సిఎం సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News