Monday, December 23, 2024

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కొల్చారం: కొల్చారం మండల పరిధిలోని ఎనిమిది కొత్త గ్రామపంచాయతీ భవనాలు మూడు పాత గ్రామపంచాయతీ కార్యాలయాలకు కొత్త భవనాలు పూర్తి కావడంతో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఎనిమిది లక్షల రూపాయలతో గ్రామపంచాయతీలు నైన్ జలాల్పూర్, వసురంతాండ, వెంకటాపూర్, కిష్టాపూర్, సంగాయిపేట, తుక్కాపూర్ రంగంపేట, హెచ్డిఎఫ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పోతంశెట్టిపల్లి 25 లక్షలు అప్పాజీపల్లి 40 లక్షలు, రాంపూర్ 25 లక్షలు నూతన గ్రామపంచాయతీ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు పోతుందని, సంక్షేమ పథకాల్లో మెరుగైన స్థానంలో బిఆర్‌ఎస్ ముందు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్, జడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్, ఎంపిపి మంజుల కాశీనాథ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ గణేష్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News