Wednesday, December 25, 2024

పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం దేశానికి గర్వకారణం: ద్రౌపదీ ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం యావత్ దేశానికి గర్వకారణం, ఆనందాయకం అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ భవనాన్ని ఆదివారం ప్రారంభించిన సమయంలో రాష్ట్రపతి తన సందేశం అందజేశారు.

ఈ ప్రారంభోత్సవ ఘట్టాన్ని దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని , మన ప్రజాస్వామిక ప్రస్థానంలో ఇది ముఖ్యమైన మైలురాయి అని ఆమె తెలియజేశారు. రాష్ట్రపతి సందేశాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News