Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నూతన టెర్మినల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూడో దశ విస్తరణలో భాగంగా తూర్పు భాగంలో 2.17 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించింది. నూతన టెర్మినల్ నుంచి పుణెకు తొలి విమానం బయలుదేరింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిపాచర్ గేట్స్ (12), ఏరో బ్రిడ్జెస్ (12), రిమోట్ బస్ డొమెస్టిక్ డిపాచర్ గేట్స్(24), కాంటాక్ట్ స్టాండ్స్ యంత్రాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎయిర్‌పోర్టులో రోబో సేవలు
ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇక నుంచి రోబోటిక్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన క్షణం నుంచి విమానంలో కూర్చునేంత వరకు ప్రయాణికులకు అవసరమైన పలు సేవలను రోబోలు అందించనున్నాయి. పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు రోబోటిక్ పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలు, యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనికోసం జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో 6 నెలల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది.

ఈ కేంద్రంలో ప్రస్తుతం రోబోలు, యంత్రాలు, పరికరాలు తయారుచేసేందుకు, అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తయితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఎయిర్‌పోర్టులో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News