Monday, January 20, 2025

నిజామాబాద్ ఆర్య వైశ్య సంఘం భవనాన్ని ప్రారభించిన కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే గణేష్ బిగాల తండ్రి బిగాల కృష్ణ మూర్తి జ్ఞాపకార్థం రూ. 75 లక్షల విరాళం

మన తెలంగాణ / హైదరాబాద్ : నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్‌లో నిర్మించిన నూతన ఆర్య వైశ్య సంఘం – బిగాల కృష్ణ మూర్తి భవనాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆదివారం ప్రారంభించారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొండ వీర శేఖర్ గుప్తా , ఆయన కార్యవర్గం అధ్వర్యములో అంగ రంగ వైభవంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం -బిగాల కృష్ణ మూర్తి భవనం ప్రారంభం జరిగింది. ఈ భవనం నిర్మించాలని దానికి ఎంఎల్‌ఏ గణేష్ బిగాల, -మహేష్ బిగాల ఈ మేరకు తండ్రి కీ.శే. బిగాల కృష్ణ మూర్తి జ్ఞాపకార్థం రూ. 75 లక్షలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా నగరంలోని వివిధ ఆర్యవైశ్య సంఘాలకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చొప్పున 60 లక్షల రూ. మంజూరు చేశారు. అంతే కాకుండా ఆర్య వైశ్య వసతి గృహం నిర్మాణానికి 1 కోటి రూ.ల నిధులు మంజూరు చేశారు.

ఈ కార్యక్రమంలో బిగల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా నాన్న సహకారం, ప్రోత్సాహంతో తాము నేడు ఈ స్థాయికి వచ్చామన్నారు. మేము ఏ పని చేయాలన్న వారి నిర్ధేశం ప్రకారం ముందుకు వెళ్ళేవాళ్ళమని, ఒక మంచి అనుబంధాన్ని తమ నాన్నతో కలిగిఉన్నామన్నారు. వారిని ఎల్లపుడు స్మరిస్తూ తమ నాన్నకు ఇష్టమైన అన్నదానం, బడి,గుడిని స్మరించుకుంటామన్నారు. తమ నాన్న జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎంఎల్‌ఏ బాజిరెడ్డి గోవర్ధన్ , నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ ,జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ,ఎంఎల్‌సి బొగ్గ్గారపు దయానంద్ గుప్తా ,ఆర్య వైశ్య మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మి నారాయణ గుప్తా, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల, కొత్త కొట ఎంపిపి మౌనిక, రేణికుంట్ల గణేష్ గుప్తా,ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆగిరి వెంకటేష్ గుప్తా,ఆర్య వైశ్య మహా సభ జిల్లా అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొండ వీర శేఖర్ గుప్తా , పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News