Sunday, December 22, 2024

శ్రీచక్ర మహాఆలయ ఆవిష్కరణకు సిఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా రమణేశ్వరం మహాక్షేత్రంలోని శ్రీ శివశక్తి షిరిడీసాయి అనుగ్రహ మహాపీఠంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిష్టించబోతున్న శ్రీచక్ర మహాఆలయం ఆవిష్కరణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పీఠం నిర్వాహకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. అక్టోబర్ 13న జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను ఆదివారం అందించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు శివ క్షేత్రం మహాత్మ్యమును, ప్రాశస్త్యాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 12 అంగుళాల 1008 పంచలోహ శ్రీచక్రాలు ప్రతిష్టించనున్నట్లు వారు సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శివశక్తి షిరిడీసాయి అనుగ్రహ మహాపీఠం కృషిని అభినందించారు. ఈ క్షేత్రం దేశంలోనే గొప్ప శైవక్షేత్రంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఈ పీఠంలోని గోశాలలో గోవుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను మంత్రి సురేఖ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గోశాలలోని గోవుల నుంచి సేకరించిన పాలతోనే రెండు వేల శివలింగాలకు ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహించడంతో పాటు ఉపాసనలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపడుతుండటం గొప్ప విషయమని మంత్రి సురేఖ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News