Sunday, December 22, 2024

చెనాబ్ రైల్వే బ్రిడ్జి జాయింట్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Inauguration of the highest Chenab Railway Bridge

శ్రీనగర్ : ప్రపంచంలోనే అతి ఎతైన చెనాబ్ రైల్వే బ్రిడ్జిలో అత్యంత కీలకమైన గోల్డెన్ జాయింట్ నిర్మాణం పూర్తయింది. ఈ సందర్బంగా లాంఛనంగా శనివారం దీనిని ప్రారంభించారు. తరువాతి క్రమంలో ఈ రైల్వే బ్రిడ్జి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతాలను కలుపుతూ చెనాబ్ నది మీద అత్యంత ఎతైన కొండ శిఖరాలను కలుపుతూ అత్యద్భుత ఇంజనీరింగ్ కట్టడంగా దీనిని నిర్మించారు. శ్రీనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు రైల్వే మార్గం ఈ బ్రిడ్జిద్వారా ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జిని గోల్డెన్ జాయింట్‌గా పేర్కొంటున్నారు. చెనాబ్ నది లోయల రెండు ప్రాంతాల నుంచి ఈ బ్రిడ్జిని ఓ తోరణంగా మలిచారు. ఈ ప్రాంతంలో మరిన్ని రైల్వే మార్గాల నిర్మాణం దిశలో సంకేతంగా దీనికి గోల్డెన్ జాయింట్ అని పేరు పెట్టినట్లు కొంకణ్ రైల్వే ఛైర్మన్, ఎండి సంజయ్ గుప్తా తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతి ఎతైన రైల్వే బ్రిడ్జిగా ఉంటుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News